October 12, 2015

KARAPU BOONDI


   కారపు బూందీ 

కావలిసిన వస్తువులు:
సెనగ పిండి - 250 గ్రా 
జీడి పప్పు- 100 గ్రా 
కారం - 2 చెంచాలు  
ఉప్పు-  2 చెంచాలు 
కరివేపాకు - కొద్దిగా 
నూనె 

తయారీ:

  • తాజా సెనగ పిండి తీసుకొని జల్లిడ పట్టి దోసెల పిండిలాగా నీళ్ళు పోసి కలుపుకోవాలి . 
  • బాణలి పొయ్యి మీద పెట్టి, నూనె పోసి బాగా కాగిన తరువాత బూందీ చట్రంలో ఒక గరిటెడు పిండి వేసి గరిటను కదలకుండా ఒక ని/ అలాగే ఉంచి తీసి ఇంకొక చిల్లుల గరిట తో బూందీని కలుపుతూ రంగు వచ్చేదాకా వేగనిచ్చి తీసి ఒక పళ్ళెంలో పోసుకోవాలి. 
  • పిండిని అంత అలాగే వేసుకొని చివరకు జీడిపప్పు, కరివేపాకు కూడా నూనెలో వేసి వేయించి బూందీలో కలుపుకొవాలి  
  • తరువాత ఉప్పు, కారం కూడా వేసి కలిపి డబ్బాలో పెట్టుకోవాలి. 
  • ఇవి చాలా రోజులు  నిల్వ ఉంటాయి 

No comments:

google.com, pub-6783067284749878, DIRECT, f08c47fec0942fa0