August 28, 2017

BOONDI LADDU

బూందీ లడ్డు 

కావలిసిన వస్తువులు:

నూనె లేదా డాల్డా - 1 కిలో
శెనగ  పిండి - 1 కిలో
పంచదార - 1 కిలో
ఏలకుల పొడి  - 1 tsp
జీడీ పప్పు - 100 గ్రా
కిస్మిస్  -1 0 గ్రా
మిఠాయి రంగు  - చిటికెడు
పచ్చ కర్పూరం - చిటికెడు

తయారీ:

  • సెనగపిండిని దోశలపిండిలాగా పలుచగా కలుపుకోవాలి. 
  •  ఒక పెద్ద వెడల్పు గిన్ని తీసుకొని అందులో పంచదార, ఒక గ్లాస్ నీళ్లు తీసుకొని లేతపాకం పట్టి దించాలి. 
  • నూనె లేదా డాల్డా బాణలిలో పోసి బాగా మరిగిన తరువాత చిల్లుల గరిటలు పెద్దవి రెండు తీసుకోవాలి,
  • ఒకదానిలో కలిపి ఉంచుకొన్న సెనగపిండి వేసి అలాగే ఒక నిమషం నూనె మూకుడుకు కొద్దీ  ఎత్తులో పట్టుకొంటే బూందీ నూనెలో పడుతుంది. 
  • అప్పుడు రెండవ చిల్లుల గరిటతో బూందీని ఆటూ ఇటూ కొద్దిసేపు వేగనిచ్చి తీసి, దించి ఉంచుకొన్న పాకంలో వెయ్యాలి. 
  • ఆలాగే పిండి అంతా అయిపోయేదాకా చెయ్యాలి. 
  • జీడిపప్పు, కిస్ మిస్ కూడా వేయించి పాకంలో పొయ్యాలి. పచ్చకర్పూరం నలిపి , ఏలకుల పొడి కలిపి  పాకంలో వేసి బాగా గరిటతో కుమ్మాలి.  మిఠాయి రంగు కూడా కలిపి బాగా వేడిమీద ఉన్నప్పుడే మనకు కావలిసిన సైజులో ఉండలు కట్టుకొని, చల్లారిన తరువాత డబ్బాలో పెట్టుకోవాలి. 
  • ఇవి 15 రోజులు నిల్వ ఉంటాయి. 

No comments:

google.com, pub-6783067284749878, DIRECT, f08c47fec0942fa0