October 11, 2015

BUDIDA GUMMADI KAYA HALWA

          బూడిద గుమ్మడికాయ హల్వా 

కావలిసిన వస్తువులు:
బూడిద గుమ్మడి కాయ - 1
పంచదార - 500 గ్రా 
జీడి పప్పు - 50 గ్రా 
కిస్ మిస్  - 20 గ్రా 
యాలుక్కాయ పొడి - 1/2 చెంచా 
పచ్చ కర్పూరం - కొద్దిగా 
కలర్ - చిటికెడు 
నెయ్యి - 125 గ్రా 

తయారీ:

  • బాగా ముదిరిన బూడిద గుమ్మడి కాయ (చిన్నది) కడిగి చెక్కు తీసి, లోపలి గుజ్జు గింజలు కూడా తీసివేసి  తురుముకోవాలి. 
  • తురుము కొనేటప్పుడు వచ్చిన నీళ్ళతో తురుము ఉడికించుకోవాలి. 
  • నీళ్ళు ఇగిరిన తరువాత పంచదార పోసి తిప్పుతూ కొద్దికొద్దిగా నెయ్యి పోస్తూ గట్టి పడేవరకు ఉడికించాలి. 
  • ఒక చెంచ నెయ్యిలో జీడి పప్పు, కిస్ మిస్ వేసి వేయించాలి. 
  • హల్వా గట్టి పడినాక జీడి పప్పు, కిస్మిస్ , ఏలుకపొడి, పచ్చ కర్పూరం, రంగు వేసి బాగా కలుపుకోవాలి. 
  • ఒక పళ్ళానికి నెయ్యి రాసి హల్వా ని అందులో పోసి ముక్కలు కోసుకోవాలి. 
  • ఈ హల్వా చాలా రుచిగా ఉంటుంది

No comments:

google.com, pub-6783067284749878, DIRECT, f08c47fec0942fa0