October 08, 2015

MYSORE PAK

                                                మైసూర్ పాక్ 

కావలిసిన వస్తువులు:
సెనగ పిండి - 500 గ్రా 
పంచదార - 800 గ్రా 
నెయ్యి -500 గ్రా 

తయారీ:

  • సెనగ పిండి జల్లిడ పట్టి పక్కన వుంచుకోవాలి. 
  • ఒక దళసరి గిన్నిలో పంచదార పోసి ఒక గ్లాసుడు నీళ్ళు  పోసి, సన్నని సెగ మీద తీగ పాకం  రానివ్వాలి. 
  • నెయ్యి కూడా ఒక గిన్నిలో పోసి బాగా మరగనివ్వాలి. పంచదార తీగ పాకం రాగానే మరిగే నెయ్యి రెండు గరిటలు పాకంలో పోస్తే పాకం బాగా గుల్ల బారుతుంది. 
  • అప్పుడు సెనగ పిండి కూడా పాకంలో కొద్దికొద్దిగా పోస్తూ బాగా కలుపుతూ పిండి అంతా పోసెయ్యాలి. 
  • మంట బాగా తగ్గించి మరిగే నెయ్యి కూడా కొద్దికొద్దిగా పోస్తూ మొత్తం పొయ్యలి. 
  • మైసూరు పాక్ బాగా పొంగి గుల్ల విచ్చుతుంది. 
  • ఒక పళ్ళేనికి నెయ్యి రాసి అందులో పొయ్యాలి . 
  • వేడి మీద ఉన్నప్పుడు సమానముగా చేసి చాకుకు నెయ్యి రాసి ముక్కలు కోసుకోవాలి. 
  • ఆరిన తరువాత డబ్బాలో పెట్టుకోవాలి. పది రోజులు నిల్వ ఉంటాయి

No comments:

google.com, pub-6783067284749878, DIRECT, f08c47fec0942fa0