May 14, 2016

BANDAR LADDU

                బందరు  లడ్డు 
కావలిసిన వస్తువులు:
సెనగ పిండి - 500 గ్రా
పంచదార - 500 గ్రా
ఎలాక్కాయల పొడి - 1/2 tsp
డాల్డా - 500 గ్రా

తయారీ:

  • తాజా సెనగ పిండి తీసుకొని సరిపడా నీళ్ళు పోసి కారప్పూస పిండి లాగా గట్టిగా కలుపుకోవాలి. 
  • డాల్డా బాణలిలో పోసి బాగా మరిగిన తరువాత, కారప్పూస గిద్దలతో వత్తి లేత రంగు వచ్చేదాకా వేగనిచ్చి తీసుకోవాలి. 
  • కారప్పూస రోటిలో వేసి బాగా మెత్తగా దంచి పక్కన పెట్టుకోవాలి. 
  • పంచదారలో కొద్దిగా నీళ్ళు పోసి సన్నని సెగ మీద లేత పాకం తీసి దంచి ఉంచిన కారప్పూస పొడిని పాకంలో పోసి బాగా కలిపి మళ్ళి రోటిలో పోసి ఏలకుల పొడి వేసి మెత్తగా దంచుకోవాలి . 
  • దానిని ఉండలు చేసి చల్లారిన తరువాత డబ్బాలో పెట్టుకోవాలి. 


No comments:

google.com, pub-6783067284749878, DIRECT, f08c47fec0942fa0