Showing posts with label Telugu. Show all posts
Showing posts with label Telugu. Show all posts

February 03, 2018

BENEFITS WITH JAGGERY


  1. బెల్లంతో మిరియాలపొడి కలిపి తింటే గొంతు నెప్పి తగ్గుతుంది. 
  2. బెల్లం, చింతపండు కలిపి ఉడికించి పట్టు వేస్తే నెప్పులు తగ్గుతాయి. 
  3. బెల్లం, అల్లం రసం కలిపి తాగితే శ్లేష్మం హరిస్తుంది. 
  4. బెల్లం, ఉమ్మెత్త, వాము నేతితో ఉడికించి కడితే పిల్లలకు వచ్చిన కురుపులు తగ్గిపోతాయి. 
  5. జిలేబి చేసిన బెల్లపు పాకం రెండు మూడు పూటలా తాగితే జిగట విరోచనాలు కట్టుబడతాయి. 
  6. అన్నంలో బెల్లం కలుపుకొని తింటే గాయాలకు చీము పట్టదు. 
  7. వాము, శొంఠి, జీలకర్ర చూర్ణం చేసి బెల్లంతో కలిపి తింటే అజీర్ణం పోయి జీర్ణశక్తి కలుగుతుంది. 
  8. శొంఠి, మిరియాలు, సైO ధవ లవణం చూర్ణం చేసి బెల్లం పాకంతో కలిపి తాగితే పిల్లలకు తరచూ వచ్చే పొడి దగ్గు తగ్గుతుంది. 
  9. బెల్లం, సున్నం కలిపి పట్టు వేస్తే గాయాలు, మచ్చలు కూడా తగ్గుతాయి. 
  10. పత్తి పూలతో కాషాయం కాచి , చలార్చి, బెల్లం కలిపి తాగితే ఋతుబద్ధం పోతుంది. 

October 03, 2017

TELUGU YEARS

SL NO
TELUGU
ENGLISH
1
 ప్రభవ 
Prabhava
2
 విభవ 
Vibhava
3
 శుక్ల 
Sukla
4
ప్రమోదూత  
Promodutha
5
 ప్రజోత్పతి 
Prajotpathi
6
 అంగిరస 
Angirasa
7
 శ్రీముఖ 
Srimukha
8
 భావ 
Bhava
9
 యువ 
Yuva
10
 ధాత 
Dhatha
11
 ఈశ్వర 
Eeshwara
12
 బహుధాన్య 
Bahudhanya
13
 ప్రమాది 
Pramadi
14
 విక్రమ 
Vikrama
15
వృష  
Vrisha
16
 చిత్రభాను 
Chitrabhanu
17
 స్వభాను 
Swabhanu
18
 తారాణ
Tarana
19
పార్థివ  
Pardhiva
20
 వ్యయ 
Vyaya
21
 సర్వజిత్తు 
Sarvajittu
22
సర్వధారి  
Sarwadhari
23
 విరోధి 
Virodhi
24
 వికృతి 
Vikruthi
25
 ఖర 
Khara
26
 నందన 
Nandana
27
 విజయ 
Vijaya
28
 జయ 
Jaya
29
 మన్మధ 
Manmadha
30
 దుర్ముఖి 
Durmukhi
31
హేవిళంబి  
Hyvalami
32
 విళంబి 
Vilambi
33
 వికారి 
Vikari
34
 శార్వరి 
Sarvari
35
 ప్లవ 
Plava
36
 శుభకృతు 
Subhakrutu
37
 శోబాకృతు 
Shobakrutu
38
 క్రోధి 
Krodhi
39
 విశ్వావసు 
Viswavasu
40
 పరాభవ 
Parabava
41

 ప్లవంగ 
Plavanga
42
 కీలక 
Kelaka
43
 సౌమ్య 
Sowmya
44
 సాధారణ 
Sadharana
45
 విధోదికృతు 
Vidhodikrutu
46
 పరీధావి 
Paridhavi
47
 ప్రమాదీచ 
Pramadhicha
48
 ఆనంద 
Ananda
49
 రాక్షస 
Rakshasa
50
 నల 
Nala
51
 పింగళ 
Pingala
52
 కాళయుక్తి 
Kalayukti
53
 సిద్దర్థి 
Sidhardhi
54
రౌద్రి  
Roudhri
55
 దుర్మతి 
Durmathi
56
 దుందుభి 
Dundhubi
57
 రుధిరోద్గారి 
Rudhirodgari
58
 రక్తాక్షి 
Rakthakshi
59
 క్రోధన 
Krodhana
60
 అక్షయ 
akshaya


April 07, 2017

ASTHADASA PURANALU

వ్యాసభగవానుడు రచించిన 18 పురాణాలును అష్టాదశ పురాణాలుగా ప్రసిద్ధి చెందాయి.  అవి

1. మత్స్య పురాణం - మత్స్యావతారమెత్తిన విష్ణువుచే మనువునకు బోధింపబడినది.

2. మార్కండేయ పురాణం - మార్కండేయ మహర్షి శివ విష్ణువుల మహాత్యములు, ఇంద్ర, అగ్ని, సూర్యుల మహాత్యములు మరియు సప్తశతి (దేవి మహత్యం) గురించి ఇందులో చెప్పారు.

3. భాగవత పురాణం: వేదవ్యాసుని వలన శుక మహర్షికి, శుకుని వలన పరీక్షిత్ మహారాజుకు 12 స్కందములలో మహా విష్ణు అవతారాలు, శ్రీ కృష్ణ జనన . లీలాచరితాలు వివరించబడినవి.

4. భవిష్య పురాణం: సూర్య భగవానునిచే మనువునకు సూర్యోపాసన విధి, అగ్నిదేవతారాధన విధానం, వర్ణాశ్రమ ధర్మాలు వివరించబడినవి. ఇందులో  ముఖ్యంగా భవిష్యత్ అనగా రాబోవు కాలం, భవిష్యత్ లో జరగబోవు విషయాలు ఇందులో వివరించబడ్డాయి.

5. బ్రహ్మ పురాణం:  దీనినే ఆదిపురాణం లేక సూర్యపురాణం అందురు. బ్రహ్మ చే దక్షునకు శ్రీకృష్ణ, మార్కండేయ, కశ్యపుల చరిత్ర వర్ణనలు, వర్ణధర్మాలు, ధర్మాచరణాలు, స్వర్గ - నరకాలను గురుంచి వివరించపడినది.

6. బ్రహ్మాండ పురాణం: బ్రహ్మ దేముడు మరిచి మహర్షికి చెప్పబడినది. రాధాదేవి, శ్రీకృష్ణుడు, పరుశురామ, శ్రీరామచంద్రుల చరితలు. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రాలు, శివకృష్ణ స్తోత్రాలు. గాంధర్వం, ఖగోళ శాస్త్రం మరియు స్వర్గ నరకాల వివరణ ఇందు వివరించబడినది.

7. బ్రహ్మ వైవర్త పురాణం: సావర్ణునిచే నారదునికి చెప్పబడినది. స్కంద, గణేశ, రుద్ర శ్రీకృష్ణుల వైభవములు, సృష్టికర్త  బ్రహ్మ, సృష్టికి కారణమయిన భౌతిక జగత్తు (ప్రకృతి) మరియు దుర్గ, లక్ష్మి, సరస్వతి,, సావిత్రి, రాధా మొదలగు పంచ శక్తుల ప్రభావం గురించి వివరించబడినది.


8. వరాహ పురాణం: వరాహ అవతారమెత్తిన విష్ణువుచే భూదేవికి చెప్పబడినది. విష్ణుమూర్తి ఉపాసనా విధానం గురుంచి వివరముగా ఉన్నది. పరమేశ్వరి, పరమేశ్వరుల చరిత్రలు, ధర్మశాస్త్రములు,  వ్రతకల్పములు, పుణ్యక్షేత్ర వర్ణనలు ఈ పురాణములో కలవు.

9.  వామన పురాణం:  పులస్త్య మహర్షి నారద మహర్షికి ఉపదేశించినది. శివలింగ ఉపాసన, శివపార్వతుల కళ్యాణం, శివగణేశ,  కార్తికేయ చరిత్రలు, భూగోళం, ఋతు వర్ణనలు వివరించబడినవి.

10. వాయు పురాణం: ఇది వాయుదేవునిచే చెప్పబడినది. శివభగవానుని మహత్యం, కాలమానం,  భూగోళం, సౌర మండల వర్ణనలు చెప్పబడినది.

11. విష్ణు పురాణం: పరాశరుడు తన శిష్యుడైన మైత్రేయునికి బోధించినది. విష్ణు మహాత్యం. శ్రీకృష్ణ, ధ్రువ, ప్రహ్లాద, భరతుల చరిత్రలు వర్ణింపపడినవి.

12.  అగ్ని పురాణం: అగ్ని భగవానునిచే వశిష్టునకు శివ, గణేశా, దుర్గా భగవాదోపసన , వ్యాకరణం, ఛందస్సు, వైద్యం, లోకిక ధర్మాలు, రాజకీయాలు, భూగోళ ఖగోళ శాస్త్రాలు, జ్యోతిష్యం మొదలగు విషయాలు చెప్పబడినవి.

13. నారద పురాణం: నారదుడు సనక, సనందన, సనత్కుమార, సనాతన అను నలుగురు బ్రహ్మ మానస పుత్రులకు చెప్పినది. అతి ప్రసిద్ధి చెందిన వేదపాదస్తవము (శివస్తోత్రం) ఇందు కలదు. వేదాంగములు, వ్రతములు, బదరి, ప్రయోగ, వారణాసి క్షేత్ర వర్ణనలు కలవు.

14.  స్కంద పురాణం: ఇది కుమారస్వామిచే చెప్పబడినది. ఇందు ముఖ్యముగా శివచరిత్ర వర్ణనలు, స్కందుని మహత్యం, ప్రదోష స్తోత్రములు, కాశీ ఖండం, కేదారఖండం. రేవా ఖండం(సత్యనారాయణ వ్రతం) , వైష్ణవ ఖండం (వేంకటాచల క్షేత్రం) , ఉత్కళ ఖండం (జగన్నాధ క్షేత్రం),  కుమారికా ఖండం (అరుణాచలం), బ్రహ్మ ఖండం (రామేశ్వర క్షేత్రం), బ్రహ్మోతర ఖండం (గోకర్ణక్షేత్రం, ప్రదోషపూజ), అవంతికఖండం (క్షిప్ర నది, మహాకాల మహాత్యము) మొదలగునవి కలవు.

15. లింగ పురాణం: ఇది శివుని ఉపదేశములు. లింగ రూప శివ  మహిమ, దేవాలయ ఆరాధనలతో పాటు వ్రతములు, భూగోళ, జ్యోతిష్య, ఖగోళ శాస్త్రములు వివరించబడినవి.

16.  గరుడ పురాణం : ఇది విష్ణువుచే గరుత్మంతునకు ఉపదేశింపబడినది. శ్రీమహావిష్ణు ఉపాసన, గరుత్మంతుని ఆవిర్భావం, జనన మరణములు, జీవి యొక్క స్వర్గ నరక ప్రయాణాలు తెలుపబడినవి.

17. కూర్మ పురాణం: కూర్మావతారమెత్తి విష్ణువుచే చెప్పబడినది. వరాహ నారసింహ అవతారాలు,  లింగరూప శివారాధన, ఖగోళం, భూగోళములతో వారణాసి, ప్రయోగ క్షేత్ర వర్ణనలు తెలుపబడినవి .

18. పద్మపురాణం: ఇందులో జన్మాంతరాల నుంచి చేసిన పాపాలను, కేవలం వినినంత మాత్రముననే పోగట్టకలిగేది ఈ పద్మపురాణం. పద్మకల్పమున జరిగిన విశేషాలను మనకు తెలియచేస్తుంది. మరియు మధుకైటభావధ, బ్రహ్మసృష్టి కార్యం, గీతార్థసారం - పఠన మహత్యం, గంగ మహాత్యం, పద్మగంధి దివ్య గాధ, గాయత్రి చరితం, రావి వృక్ష మహిమ, విభూది మహత్యం , పూజావిధులు - విధానం, భగవంతుని సన్నిధిలో ఏవిధముగా ప్రవర్తించాలో పద్మపురాణములో వివరంగా తెలియచేయపడినది.google.com, pub-6783067284749878, DIRECT, f08c47fec0942fa0