Showing posts with label Telugu recipes. Show all posts
Showing posts with label Telugu recipes. Show all posts

August 28, 2017

BOONDI LADDU

బూందీ లడ్డు 

కావలిసిన వస్తువులు:

నూనె లేదా డాల్డా - 1 కిలో
శెనగ  పిండి - 1 కిలో
పంచదార - 1 కిలో
ఏలకుల పొడి  - 1 tsp
జీడీ పప్పు - 100 గ్రా
కిస్మిస్  -1 0 గ్రా
మిఠాయి రంగు  - చిటికెడు
పచ్చ కర్పూరం - చిటికెడు

తయారీ:

  • సెనగపిండిని దోశలపిండిలాగా పలుచగా కలుపుకోవాలి. 
  •  ఒక పెద్ద వెడల్పు గిన్ని తీసుకొని అందులో పంచదార, ఒక గ్లాస్ నీళ్లు తీసుకొని లేతపాకం పట్టి దించాలి. 
  • నూనె లేదా డాల్డా బాణలిలో పోసి బాగా మరిగిన తరువాత చిల్లుల గరిటలు పెద్దవి రెండు తీసుకోవాలి,
  • ఒకదానిలో కలిపి ఉంచుకొన్న సెనగపిండి వేసి అలాగే ఒక నిమషం నూనె మూకుడుకు కొద్దీ  ఎత్తులో పట్టుకొంటే బూందీ నూనెలో పడుతుంది. 
  • అప్పుడు రెండవ చిల్లుల గరిటతో బూందీని ఆటూ ఇటూ కొద్దిసేపు వేగనిచ్చి తీసి, దించి ఉంచుకొన్న పాకంలో వెయ్యాలి. 
  • ఆలాగే పిండి అంతా అయిపోయేదాకా చెయ్యాలి. 
  • జీడిపప్పు, కిస్ మిస్ కూడా వేయించి పాకంలో పొయ్యాలి. పచ్చకర్పూరం నలిపి , ఏలకుల పొడి కలిపి  పాకంలో వేసి బాగా గరిటతో కుమ్మాలి.  మిఠాయి రంగు కూడా కలిపి బాగా వేడిమీద ఉన్నప్పుడే మనకు కావలిసిన సైజులో ఉండలు కట్టుకొని, చల్లారిన తరువాత డబ్బాలో పెట్టుకోవాలి. 
  • ఇవి 15 రోజులు నిల్వ ఉంటాయి. 

March 14, 2017

BOMMIDAYALU - CHINTAKAYALA EGURU

బొమ్మిడాయలు - చింతకాయల ఇగురు 

కావలిసిన వస్తువులు:
బొమ్మిడాయలు  - 25
చింతకాయలూ - 500 గ్రా
ధనియాలపొడి - 2 tsp
జీలకర్ర - 1 tsp
అల్లం - 1" ముక్క
వెల్లులిపాయ - 1 1/2
ఉల్లిపాయలు - 3
కారం - 1 tbsp
ఉప్పు
పసుపు - 1/2 tsp
పచ్చిమిర్చి - 3-4
పచ్చి కొబ్బరి - 1/2
ఉల్లికాడల కట్ట - 1
నూనె - 1 కప్
ఆవాలు - 1/2 tsp
కరివేపాకు
కొత్తిమీర

తయారీ:

  • ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఉల్లికాడలు సన్నగా కోసి పెట్టుకోవాలి. 
  • చింతకాయలూ  నూరి, పిసికి, పిప్పి తీసివెయ్యాలి. 
  • ధనియాలు, జీలకర్ర, అల్లం, వెల్లులి కలిపి మెత్తగా ముద్దగా నూరుకోవాలి. 
  • అర కప్ నూనె వేడి చేసి చేపలు వేయించి అందులో అల్లం ముద్ద, ఉప్పు, కారం, పసుపు, చింతకాయ గుజ్జు వేసి కలిపి ఉంచాలి. 
  • కొబ్బరి తురుమి వేడి నీటిలో 5 ని లు నానపెట్టి కొబ్బరి  పాలు తీసుకోవాలి. 
  • బాణలిలో మిగిలిన నూనె పోసి కాగిన తరువాత ఆవాలు, కరివేపాకు వేయుంచుకోవాలి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఉల్లికాడలు వేసి వేగిన తరువాత చేప ముక్కలు వేసి సన్నని సెగ మీద 20 ని లు మగ్గనివ్వాలి. 
  • అందులో కొబ్బరి పాలు, కొత్తిమీర వేసి మరో పది ని లు మగ్గనివ్వాలి. 

October 29, 2016

VANKAYA - MULAKKAYA PULUSU (BRINJAL AND DRUMSTICK SWEET AND SOUR CURRY)

      వంకాయ - ములక్కాయ పులుసు 

కావలిసిన వస్తువులు:
వంకాయలు - 250 గ్రా 
ములక్కాయ - 1
ఉల్లిపాయ  - 1
పచ్చిమిర్చి- 2
చింత పండు గుజ్జు - 2-3 tbsp 
పసుపు - 1/4 tsp 
ధనియాలు-జీలకర్ర పొడి - 1/2 tsp 
ఉప్పు- సరిపడా 
కారం - 2 tsp 
బెల్లం - చిన్న ముక్క 

తాలింపు:
నూనె/ నెయ్యి - 1 tbsp 
ఎండు మిర్చి - 2
వెల్లులి రేకలు - 4
మెంతులు - 1/4 tsp 
ఆవాలు, జీలకర్ర - 1/4 tsp 
కరివేపాకు - కొద్దిగా 

తయారీ:

  • ఉల్లిపాయ, పచ్చిమిర్చి సన్నగా తరిగి పెట్టుకోవాలి. ములక్కాయ 2" ముక్కలుగా కోసుకోవాలి. 
  • చిన్న వంకాయలు అయితే గుత్తులుగా, పొడవు వంకాయలు అయితే ముక్కలుగా కోసి నీళ్లలో వేసి ఉంచుకోవాలి. . 
  • బాణలిలో నూనె/ నెయ్యి వేడి చేసి తాలింపు దినుసులు వేయుంచుకోవాలి. 
  • వేగిన తరువాత ఉల్లిపాయ, మిర్చి, వంకాయలు, ములక్కాయ ముక్కలు, పసుపు, ఉప్పు వేసి కాసేపు మగ్గనివ్వాలి. 
  • ముక్క కొద్దిగా మగ్గిన తరువాత ధనియాల పొడి, కారం బెల్లం, చింతపండు గుజ్జు, ఒక కప్ నీళ్లు పోసి మూత పెట్టి మగ్గనివ్వాలి. 
  • పులుసు కొద్దిగా చిక్కపడినాక దించుకోవాలి. 

October 27, 2016

KANDA FRY WITH LEMON JUICE

              కంద ఫ్రై - నిమ్మ రసం 

కావలిసిన వస్తువులు:
కంద - 500 గ్రా 
 అల్లం - పచ్చిమిర్చి ముద్ద - 1 tbsp 
పసుపు - 1/4 tsp 
ఉప్పు 
నిమ్మకాయలు -2
ఎండు - మిర్చి 5-6
సెనగ పప్పు - 1/2 tsp 
మినపప్పు - 1/2 tsp 
ఆవాలు- 1/4  tsp 
జీలకర్ర- 1/4 tsp 
కరివేపాకు - కొద్దిగా 
నూనె - 3 tbsp 

తయారీ:

  • కంద ఉడికించి, పెచ్చు తీసి, ముక్కలు కోసుకోవాలి. 
  • బాణలిలో నూనె  వేడి చేసి, ఎండు మిర్చి ముక్కలు, మినపప్పు, సెనగపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి వేగిన తరువాత అల్లం- పచ్చిమిర్చి ముద్ద వేసి వేగనివ్వాలి. 
  • అందులో కంద ముక్కలు, పసుపు, ఉప్పు  వేసి బాగా  కలిపి  కొంచెం సేపు వేయించి దించుకోవాలి. 
  • దించిన తరువాత నిమ్మరసం  పిండి  కలుపుకోవాలి. 



October 25, 2016

CHITTI BUDAGALU

        చిట్టి బుడగలు

కావలిసిన వస్తువులు:
మినపప్పు - 150 గ్రా
బియ్యం పిండి - 1 కిలో
వాము - 2 tsp
ఉప్పు, కారం - సరిపడా
 నూనె - వేయించటానికి

తయారీ:

  •  మినపప్పు నానపెట్టి మెత్తగా రుబ్బుకోవాలి. 
  • రుబ్బిన పిండిలో బియ్యం పిండి, ఉప్పు, కారం, వాము వేసి పూరీలా పిండిలా కలుపుకోవాలి. 
  • పిండిని చిన్న ఉండలుగా చేసుకొని చిన్న బిళ్లలుగా ఒత్తుకోవాలి. 
  • బాణలిలో నూనె పోసి వాటిని ఎర్రగా రెండు వైపులా వేయుంచుకోవాలి. 
  • ఇవి చాలా రుచిగా ఉంటాయి. 

October 23, 2016

UPPU CHEPA VEPUDU

                      ఉప్పు చేప వేపుడు


కావలిసిన వస్తువులు:
ఉప్పు చేప  - 250 గ్రా
కారం - 1 tbsp
నూనె  - 50 గ్రా

తయారీ:

  •  ఉప్పు చేపను  శుభ్రం చేసి ముక్కలు చేసుకోవాలి. 
  • బాణలిలో నూనె పోసి కాగిన తరువాత చేప ముక్కలు వేసి ఎర్రగా వేయించాలి.
  • వేగిన తరువాత కారం జల్లి బాగా ఎర్రగా వేయించి దించుకోవాలి. 

PEETHALA PULUSU

  పీతల పులుసు

కావలిసిన వస్తువులు:
పీతలు  - 1 కిలో
మజ్జిగ- 1 గ్లాస్
చింత పండు పులుసు - సరిపడా
ఉప్పు
పసుపు
కారం - 1 tbsp
ఉల్లిపాయలు - 2

తడి మసాలా :
ఉల్లిపాయలు  -3
పచ్చిమిర్చి - 6
అల్లం- ఒక ముక్క
వెల్లులి - 2 పాయలు
కొబ్బరి ముక్క - 1
గసగసాలు - 2 tsp

పొడి మసాలా:
ధనియాలు - 2 tsp
ఏలకులు - 2
లవంగాలు - 4
దాల్చిన చెక్క -3


తయారీ:

  •  తడి మసాలా కు కావలిసిన వస్తువులు   మెత్తగా రుబ్బుకోవాలి. 
  • ధనియాలు, ఏలకులు, లవంగాలు, దాల్చిన చెక్క వేయించి పొడి కొట్టుకోవాలి. 
  • పీతలు కాళ్ళు తీసేసి, పైన పెచ్చులు తీసి, ముక్కలు కోసి, శుభ్రంగా కడిగి, ఉప్పు, పసుపు, మజ్జిగతో బాగా కడగాలి. 
  •  కడిగిన ముక్కలకు తడి మసాలా బాగా పట్టించుకోవాలి. 
  • బాణలిలో నూనె వేడి చేసి ఉల్లిపాయ ముక్కలు ఎర్రగా వేయుంచుకోవాలి. వేగిన తరువాత పీత ముక్కలు మాసాలతో  కలిపి వేసి వేయించాలి. 
  • నీళ్లు సరిపడా పోసి ఉడికించాలి. 
  • పీతలు చాలా ఆలస్యంగా ఉడుకుతాయి. ముక్క మెత్తగా ఉడికిన తరువాత చింతపండు పులుసు, కారం ఉప్పు, పసుపు వేసి కొంచెం సేపు మగ్గనివ్వాలి. 
  • చివరకు పొడి మసాలా, కొత్తిమీర వేసి రెండు నిముషాలు మగ్గనిచ్చి దించుకోవాలి. 




CHEPA EGURU KOORA

         చేప ఇగురు కూర

కావలిసిన వస్తువులు:
చేప - 1 కిలో
ఉల్లిపాయలు - 4
కొబ్బరి చిప్ప - 1
అల్లం వెల్లులి ముద్ద  - 2 tsp
పచ్చిమిర్చి - 4
ఉప్పు
పసుపు - 1 tsp
కారం - 1 tbsp
జీలకర్ర - 1 tsp
కొత్తిమీర  - చిన్న కట్ట
నూనె - 5-6 tbsp

తయారీ:

  •  చేప శుభ్రం చేసి ముక్కలు కోసుకోవాలి. 
  • కొబ్బరి రుబ్బి  పాలు తీసి పక్కన పెట్టుకోవాలి,
  •  ఉల్లిపాయలు, పచ్చిమిర్చి సన్నగా తరుగుకోవాలి. 
  • బాణలిలో నూనె వేడి చేసి జీలకర్ర వేయుంచుకోవాలి. 
  • తరువాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లులి ముద్ద  వేసి ఎర్రగా వేయుంచుకోవాలి. 
  • చేప ముక్కలు, పసుపు,ఉప్పు, కారం వేసి జాగ్రత్తగా కలిపి వేయుంచుకోవాలి..
  • ఒక కప్ నీళ్లు పోసి మగ్గిన తరువాత కొబ్బరి పాలు పొయ్యాలి. 
  • కూర ఉడికి దగ్గిర పడిన తరువాత కొత్తిమీర జల్లి దించుకోవాలి. 

October 21, 2016

ROYYALA AAVAKAYA

            రొయ్యల ఆవకాయ 


కావలిసిన వస్తువులు:
ముదురు రొయ్యలు - 1 కిలో 
ఆవాలు - 100 గ్రా
 పచ్చి కారం - 100 గ్రా 
ఉప్పు - 100 గ్రా 
నిమ్మ రసం - 1 కప్ 
వెల్లులి పాయలు - 2
పసుపు - 1 tsp 
నూనె - 500 గ్రా 

తయారీ:

  1. రొయ్యలు శుభ్రం చేసి బాణలిలో నూనె వేడి చేసి రొయ్యలు ఎర్రగా వేయుంచుకోవాలి. 
  2. వేగిన తరువాత బాణలి దించి చల్లారనివ్వాలి. 
  3. ఆవాలు పొడి చేసుకోవాలి. వెల్లులి కొద్దీగా  దంచి పక్కన పెట్టుకోవాలి. 
  4. రొయ్యలు చల్లరిన తరువాత ఉప్పు, పసుపు, కారం,వెల్లులి, నిమ్మ రసం, ఆవ పిండి వేసి అన్ని కలిపి జాడీలో వేయాలి. 
  5. మరుసటి రోజు మరల కలిపి, ఉప్పు సరి చూసుకొని అవసరం అయితే కలుపుకోవాలి. 

October 19, 2016

RAWA LADDU

                             రవ్వ లడ్డు 

కావలిసిన వస్తువులు:
బొంబాయి రవ్వ - 1 కప్ 
పంచదార పొడి - 2/3 కప్ 
జీడిపప్పు ముక్కలు -  1 tbsp 
కిస్మిస్ - 1 tsp 
నెయ్యి- 2-3 tbsp 
వేడి పాలు 

తయారీ:

  • జీడిపప్పు, కిస్మిస్ నేతిలో వేయించి పక్కన పెట్టుకోవాలి. 
  • ఒక చెంచా నేతిలో రవ్వ దోరగా వేయుంచుకోవాలి. 
  • వేగిన తరువాత దించి అందులో పంచదార పొడి, కరిగిన నెయ్యి, జీడిపప్పు, కిస్మిస్ వేసి బాగా కలుపుకోవాలి. 
  • అవసరం అయితే కొద్దిగా వేడి పాలు చల్లి లడ్డులు చేసుకోవాలి. 
  • ఇవి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా చేసుకోవచ్చు


CHINTAKAYA ROYYALU

                     చింతకాయ రొయ్యల కూర 

కావలిసిన వస్తువులు:
రొయ్యలు- 500 గ్రా 
లేత చింతకాయలు - 200 గ్రా 
ఉల్లిపాయలు - 4
పచ్చిమిర్చి - 10
ఉప్పు 
పసుపు- 1/2 tsp 
కారం - 2 tsp 
నూనె - 4 tbsp 

తయారీ:

  • రొయ్యలు వొలిచి కడిగి  పసుపు, ఉప్పు చల్లి పక్కన పెట్టుకోవాలి. 
  • చింతకాయలు మెత్తగా తొక్కుకోవాలి. అప్పుడు గింజలు తీసివేయాలి. 
  • ఉల్లిపాయలు, పచ్చిమిర్చి సన్నగా కోసి పక్కన పెట్టుకోవాలి. 
  • బాణలిలో నూనె వేడి చేసి రొయ్యలు 2-3 ని లు వేయుంచుకోవాలి. అందులో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ముక్కలు, చింతకాయ ముద్దా వేసి కొద్దిసేపు వేగనివ్వాలి. 
  • వేగిన తరువాత ఉప్పు, పసుపు, కారం, ఒక కప్ నీళ్లు పోసి ఇగిరిన తరువాత దించుకోవాలి. 

September 25, 2016

PANASA POTTU MUDDA KOORA

పనస పొట్టు ముద్ద కూర 
కావలిసిన వస్తువులు:
పనస పొట్టు - 250 గ్రా 
పెసర పప్పు - 100 గ్రా 
ఉప్పు 
పసుపు - 1/2 tsp 
కారం - 2 tsp 
వడియాలు - 10 (వేయించినవి)

తాలింపు:
ఎండు మిర్చి - 2
మినపప్పు- 1/4 tsp 
ఆవాలు, జీలకర్ర - 1/4 tsp 
ఇంగువ - చిటికెడు నూనె -1 tbsp 

తయారీ:

  • పనస పొట్టు బాగా కడిగి, కడిగిన  పెసర  పప్పుతో కలిపి మెత్తగా ఉడికించుకోవాలి. 
  • నూనె బాణలిలో వేడి చేసి తాలింపు దినుసులు వేసి వేయుంచుకోవాలి. 
  • అందులో ఉడికించిన  పప్పు, పొట్టు మిశ్రమం వేసి కలపాలి. 
  • అందులో పసుపు, ఉప్పు, కారం వేసి 5 ని ఉడికించాలి. 
  • చివర్లో వడియాలు వేసి దించుకోవాలి. 



September 21, 2016

SOJJA BHAKSHYALU

సొజ్జ భక్ష్యాలు 

కావలిసిన వస్తువులు:
మైదా - 250 గ్రా 
బొంబాయి రవ్వ - 250 గ్రా 
పంచదార  - 250 గ్రా 
ఏలకులు - 10
నెయ్యి 

తయారీ:

  • మైదా పిండి జల్లించి ఒక చెంచా నెయ్యి వేసి సరిపడా నీళ్లు పోసి పూరీలా పిండిలా కలిపి మర్దన బాగా చెయ్యాలి. 
  • ఒక గిన్నిలో 600 ml నీళ్లు పోసి మరుగుతున్నప్పుడు బొంబాయి రవ్వ కొద్దికొద్దిగా పోస్తూ ఉండలు కట్టకుండా కలపాలి. 
  • రవ్వ ఉడికిన తరువాత పంచదార వేసి బాగా కలిపి రెండు చెంచాలు నెయ్యి, ఏలకుల పొడి వేసి బాగా కలిపి దగ్గిర పడిన తరువాత దించి చల్లారనివ్వాలి. 
  • మైదా పిండిని సుమారుగా 25 ఉండలు చేసుకొని వాటిని పూరిలాగా చేసి అందులో బొంబాయి రవ్వ పూర్ణాన్ని పెట్టి  మల్లి ఈ పూరీని మూసి నెయ్యి చేతితో వత్త్తి పూరిలాగా చేసుకోవాలి. 
  • వీటిని పెనం మీద వేసి నేతితో దోరగా కాలనిచ్చి తీసుకోవాలి. 
  • ఇవి రెండు రోజులు నిల్వ ఉంటాయి. 

PESARATTU

పెసరట్టు  

కావలిసిన వస్తువులు:
పెసలు - 250 గ్రా 
బియ్యం - 50 గ్రా 
 పచ్చిమిర్చి - 5-6
అల్లం -  చిన్న ముక్క 
జీలకర్ర - 1/2 tsp 
ఉప్పు 
ఉల్లిపాయ ముక్కలు - 1/2 కప్ (సన్నగా)
నెయ్యి/నూనె 

తయారీ:

  • పెసలు, బియ్యం కలిపి 2-3 గంటలు నానపెట్టుకోవాలి. నానిన తరువాత కడిగి అల్లం, ఉప్పు, పచ్చిమిర్చి వేసి మెత్తగా రుబ్బుకోవాలి. 
  • రుబ్బిన పిండిలో జీలకర్ర వేసి కలుపుకోవాలి. 
  • పెనం మీద గరిటెడు పిండి దోశలాగా వేసుకొని మధ్యలో ఉల్లిపాయ ముక్క చల్లి చుట్టూ నెయ్యి కానీ నూనెగాని వేసి కాలిన తరువాత వేడిగా అల్లం పచ్చడితో గాని వేరే పచ్చడితో వడ్డించాలి. 


September 19, 2016

ARATI PUVVU VADA

ఆరటి  పువ్వు తో వడ 

కావలిసిన వస్తువులు:
అరటి పువ్వు  - 1
శనగ పప్పు - 1 1/2 కప్ 
ఉల్లిపాయ - 1 పెద్దది 
అల్లం -1" ముక్క 
జీలకర్ర - 1 tsp 
పచ్చిమిర్చి -5-6
ఉప్పు 
కరివేపాకు - కొద్దిగా 
నూనె 

తయారీ:

  • అరటి పువ్వు బాగు చేసి ఉడకపెట్టుకోవాలి. 
  • శెనగపప్పు 2 గంటలు నానపెట్టి కడిగి మెత్తగా రుబ్బుకోవాలి. 
  • అల్లం, పచ్చిమిర్చి, ఉప్పు కలిపి మెత్తగా నూరుకోవాలి. 
  • ఉల్లిపాయలు సన్నగా తరిగి అరటి పువ్వు ముద్ద, సెనగ పప్పు ముద్దా, అల్లం ముద్ద, జీలకర్ర, కరివేపాకు అన్ని కలిపి పెట్టుకోవాలి. 
  • నూనె వేడి చేసి కాగిన తరువాత పిండిని చిన్న చిన్న వడలు చేసుకొని ఎర్రగా వేయుంచుకోవాలి. 
  • వేడిగా  వీటిని తింటే చాలా బాగుంటాయి.  

May 23, 2016

SAGGUBIYYAM JANTHIKALU

          సగ్గుబియ్యం జంతికలు 
కావలిసిన వస్తువులు:
బియ్యం - 4 గ్లాసులు 
నువ్వులు - 2 tbsp 
సగ్గుబియ్యం - 1 గ్లాస్ 
వెన్న - 1 tbsp 
వాము - 2 tsp 
ఉప్పు, కారం -  సరిపడా 
నూనె 

తయారీ:

  • బియ్యం, నువ్వులు, సగ్గుబియ్యం కలిపి మిషన్లో  మెత్తగా పిండి పట్టించి జల్లించి పెట్టుకోవాలి. 
  • వాము, ఉప్పు కలిపి పొడి చేసుకోవాలి. 
  • ఒక పెద్ద గిన్నిలో పిండి, వాము పొడి, కారం, వెన్న వేసుకొని బాగా కలిపి సరిపడా నీళ్ళు పోసి గట్టిగా కలిపి పెట్టుకోవాలి. 
  • బాణలిలో నూనె పోసి బాగా కాగిన తరువాత జంతికల గొట్టంలో పిండి సరిపడా పెట్టికొని నూనెలో చక్రలవలె వత్తాలి. 
  • వేగిన తరువాత తీసి ఇదే విధంగా మిగిలిన పిండితో చేసుకోవాలి. 
  • ఆరిన తరువాత డబ్బాలో పెట్టుకొంటే 15 రోజులు నిల్వ ఉంటాయి. 
 

May 21, 2016

KOTHIMEERA VADIYALU

   కొత్తిమీర వడియాలు 

కావలిసిన వస్తువులు:
కొత్తిమీర  - 1 కిలో 
మినపప్పు - 250 గ్రా 
ఉప్పు - 2 tbsp 
పచ్చి మిరపకాయలు - 100 గ్రా లేదా సరిపడా 

తయారీ:

  • పొట్టు మినపప్పు తీసుకొని 3 గంటలు నానపెట్టి బాగా కడుక్కోవాలి. 
  • కొత్తిమీర, పచ్చి మిర్చి కడిగి కోసుకోవాలి. 
  • మినపప్పు, కొత్తిమీర, మిర్చి, ఉప్పు వేసి నీళ్ళు కలపకుండా గారెల పిండిలాగా గట్టిగా రుబ్బుకోవాలి
  • పిండిని గిన్నిలోకి తీసుకొని వెంటనే ప్లాస్టిక్ షీట్ మీద చిన్న గోళి సైజు ముద్దలుగా పెట్టి బాగా ఎండ పెట్టుకోవాలి. 
  • బాగా ఎండిన తరువాత డబ్బాలో పెట్టుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు కొన్ని నూనెలో వేయుంచు కోవాలి. 
  • ఇవి అన్నం, పప్పు కూర, సాంబార్తో బాగుంటాయి

MANGO SQUASH

         మామిడి పండ్ల రసంతో జ్యూస్ 

కావాల్సిన వస్తువులు:
మామిడి పండ్ల రసం - 1 లీటర్ (రసాలు)
పంచదార - 1750 గ్రా 
సిట్రిక్ ఆసిడ్ (నిమ్మ ఉప్పు) - 30 గ్రా 
లెమన్ కలర్ - చిటికెడు 
K.M.S  - 3/4 tsp 
మంగో ఎసెన్స్ - 4 tsp 

తయారీ:

  • పంచదార నీళ్ళు కలిపి గిన్నిలో పోసి పంచదార కరిగిన తరువాత  నిమ్మ ఉప్పు వేసి దించుకోవాలి. 
  • బాగా చల్లారిన తరువాత మామిడి పండ్ల రసం, మిగిలిన వస్తువులు వేసి బాగా కలపాలి. 
  • కలిపిన తరువాత పొడి గాజు సీసాలో పోసుకొని గాలి పోకుండా గట్టిగ మూత పెట్టుకొని 6 నెలలు వాడుకోవచ్చును. 

May 14, 2016

PULLATLU

                 పుల్లట్లు 
కావలిసిన వస్తువులు:
బియ్యం - 500 గ్రా
మినపప్పు - 250 గ్రా
పచ్చిమిరపకాయలు - 10
ఉల్లిపాయలు - 2
ఉప్పు

తయారీ:

  • బియ్యం, పప్పు కలిపి 6 గంటలు నానపెట్టి శుబ్రంగా కడిగి మెత్తగా రుబ్బుకోవాలి. 
  • రుబ్బిన పిండిని ఒక రోజు పులవ పెట్టాలి. 
  • మరుసటి రోజు ఉల్లిపాయలు, పచ్చి మిరపకాయలు, ఉప్పు దంచి పిండిలో కలుపుకోవాలి. 
  • పెనం మీద కొద్దిగా నూనె వేసి గరిటెడు పిండి వేసి అట్టు లాగా వేసి రెండు వేపుల కాల్చుకోవాలి. 

BANDAR LADDU

                బందరు  లడ్డు 
కావలిసిన వస్తువులు:
సెనగ పిండి - 500 గ్రా
పంచదార - 500 గ్రా
ఎలాక్కాయల పొడి - 1/2 tsp
డాల్డా - 500 గ్రా

తయారీ:

  • తాజా సెనగ పిండి తీసుకొని సరిపడా నీళ్ళు పోసి కారప్పూస పిండి లాగా గట్టిగా కలుపుకోవాలి. 
  • డాల్డా బాణలిలో పోసి బాగా మరిగిన తరువాత, కారప్పూస గిద్దలతో వత్తి లేత రంగు వచ్చేదాకా వేగనిచ్చి తీసుకోవాలి. 
  • కారప్పూస రోటిలో వేసి బాగా మెత్తగా దంచి పక్కన పెట్టుకోవాలి. 
  • పంచదారలో కొద్దిగా నీళ్ళు పోసి సన్నని సెగ మీద లేత పాకం తీసి దంచి ఉంచిన కారప్పూస పొడిని పాకంలో పోసి బాగా కలిపి మళ్ళి రోటిలో పోసి ఏలకుల పొడి వేసి మెత్తగా దంచుకోవాలి . 
  • దానిని ఉండలు చేసి చల్లారిన తరువాత డబ్బాలో పెట్టుకోవాలి. 


google.com, pub-6783067284749878, DIRECT, f08c47fec0942fa0