మామిడి ఆవకాయ
కావలిసిన వస్తువులు:
పచ్చి మామిడి కాయలు - 1 kg
పచ్చి కారం - 125 gms
మెత్తటి -ఉప్పు 125 gms
ఆవ పిండి - 125 gms
మెంతి పిండి - 2 tbsp
పసుపు - 1 tsp
వెల్లులి పాయలు - 2
పప్పు నూనె - 250 gms
తయారీ:
కావలిసిన వస్తువులు:
పచ్చి మామిడి కాయలు - 1 kg
పచ్చి కారం - 125 gms
మెత్తటి -ఉప్పు 125 gms
ఆవ పిండి - 125 gms
మెంతి పిండి - 2 tbsp
పసుపు - 1 tsp
వెల్లులి పాయలు - 2
పప్పు నూనె - 250 gms
తయారీ:
- మామిడి కాయలు కడిగి పొడి బట్టతో తుడిచి మధ్యస్థం ముక్కలుగా కోసుకోవాలి. గింజ తీసివేసి ముక్క లోపల ఉన్న తెల్లని పొర తియ్యాలి.
- ముక్కలను సాయంత్రం వరకు పొడి బట్ట మీద పరచి ఆరపెట్టుకోవాలి.
- ఒక గిన్నిలో 150 gms నూనె పెట్టుకోవాలి. మరి ఒక గిన్నిలో కారం, ఉప్పు, ఆవ పిండి, మెంతి పిండి, పసుపు, ఒక వెల్లులి పాయ పేస్టు బాగా కలుపుకోవాలి .
- ముందుగా కొన్ని ముక్కలు తీసుకొని నూనెలో ముంచి కారం మిశ్రమంలో కలిపి వేరే గిన్నిలో పెట్టుకోవాలి.
- ఇలా మిగిలిన ముక్కలు కూడా కలిపి గిన్నిలోకి ఎత్తుకోవాలి.
- వెల్లులి పాయ వలిచి అందులో కలపాలి. మిగిలిన నూనె, కారం పొడి కూడా వేసి బాగా కలిపి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి.
- మరుసటి రోజు మళ్ళి కలిపి మూత పెట్టాలి . మూడవ రోజు ఉప్పు సరిచూసుకొని జాడి లోకి పెట్టుకోవాలి.
- జాడిలో పచ్చడి పెట్టేముందు కొద్దిగా నూనె పోసి పచ్చడి పెట్టినాక మిగిలిన నూనె పోసి మూత పెట్టాలి.
- ఆవకాయ పచ్చడి రెడీ
No comments:
Post a Comment