March 14, 2017

BOMMIDAYALU - CHINTAKAYALA EGURU

బొమ్మిడాయలు - చింతకాయల ఇగురు 

కావలిసిన వస్తువులు:
బొమ్మిడాయలు  - 25
చింతకాయలూ - 500 గ్రా
ధనియాలపొడి - 2 tsp
జీలకర్ర - 1 tsp
అల్లం - 1" ముక్క
వెల్లులిపాయ - 1 1/2
ఉల్లిపాయలు - 3
కారం - 1 tbsp
ఉప్పు
పసుపు - 1/2 tsp
పచ్చిమిర్చి - 3-4
పచ్చి కొబ్బరి - 1/2
ఉల్లికాడల కట్ట - 1
నూనె - 1 కప్
ఆవాలు - 1/2 tsp
కరివేపాకు
కొత్తిమీర

తయారీ:

  • ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఉల్లికాడలు సన్నగా కోసి పెట్టుకోవాలి. 
  • చింతకాయలూ  నూరి, పిసికి, పిప్పి తీసివెయ్యాలి. 
  • ధనియాలు, జీలకర్ర, అల్లం, వెల్లులి కలిపి మెత్తగా ముద్దగా నూరుకోవాలి. 
  • అర కప్ నూనె వేడి చేసి చేపలు వేయించి అందులో అల్లం ముద్ద, ఉప్పు, కారం, పసుపు, చింతకాయ గుజ్జు వేసి కలిపి ఉంచాలి. 
  • కొబ్బరి తురుమి వేడి నీటిలో 5 ని లు నానపెట్టి కొబ్బరి  పాలు తీసుకోవాలి. 
  • బాణలిలో మిగిలిన నూనె పోసి కాగిన తరువాత ఆవాలు, కరివేపాకు వేయుంచుకోవాలి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఉల్లికాడలు వేసి వేగిన తరువాత చేప ముక్కలు వేసి సన్నని సెగ మీద 20 ని లు మగ్గనివ్వాలి. 
  • అందులో కొబ్బరి పాలు, కొత్తిమీర వేసి మరో పది ని లు మగ్గనివ్వాలి. 

No comments:

google.com, pub-6783067284749878, DIRECT, f08c47fec0942fa0